Ram Gopal Varma : హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరో షాక్ తగిలింది. ఆయనపై ఇప్పటికే ఏపీలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తను బెయిల్ పై ఉన్నారు. తాజా ఆయనకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. తనపై ఇంకో కేసు నమోదైంది. తను తీస్తున్న వెబ్ సీరీస్ లో మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కు సంబంధించిన గుర్తింపును దుర్వినియోగం చేశారంటూ ఆర్జీవీపై (Ram Gopal Varma) ఫిర్యాదు అందింది. ఈ మేరకు వివాదాస్పద దర్శకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంతకూ ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో కాదు అంజనా సిన్హా. దహనం అనే వెబ్ సిరీస్‌లో తన గుర్తింపును దుర్వినియోగం చేశారని సదరు అధికారిణి తీవ్ర ఆరోపణలు చేసింది. రామ్ గోపాల్ వర్మ తనను డ్యామేజ్ చేశాడని వాపోయింది.
Ram Gopal Varma Case
దీంతో హైదరాబాద్ పోలీసులు చిత్ర నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. తన అనుమతి లేకుండా తన పేరు, ప్రొఫైల్‌ను ఉపయోగించారని ఆమె చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో తన వృత్తిపరమైన గుర్తింపును దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు ఆర్జీవీపై. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ సిరీస్ తన అనుమతి లేకుండా తన పేరు, కెరీర్ ప్రొఫైల్‌ను చిత్రీకరించారని మండిపడ్డారు. తాను ఆ సిరీస్ నిర్మాతలను ఎప్పుడూ కలవలేదని, వారితో సంభాషించ లేదని, వెబ్ సిరీస్‌లో తన వివరాలను ఉపయోగించడానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని కూడా ఆమె చెప్పింది. రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఈ చిత్రానికి అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read : Hyderabad Rains Sensational : భారీ వర్షం హైదరాబాద్ అతలాకుతలం


















