నంద్యాల జిల్లా : ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ ఎత్తున ఫోకస్ పెట్టారు ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో శాంతి భద్రతలకు సంబంధించి. ఈ సందర్బంగా వివిధ శాఖల సమన్వయంతో పోలీసులు మాక్ డ్రిల్ చేపట్టారు. అనుకోని విపత్తు జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనే అంశంపై ప్రయాణీకులు, ప్రజలు, భక్తులకు వివరించారు. శ్రీశైలంలో రాబోవు శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ ఉత్తర్వుల మేరకు అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ఎలా రక్షించాలి అంశంపై ఇవాళ శ్రీశైల మహా పుణ్యక్షేత్రం లో గల సిద్ధరామయ్య కాంప్లెక్స్ వద్ద మాక్ డ్రిల్ చేపట్టారు.
ఈ మాక్ డ్రిల్ లో భాగంగా ఏదైనా భవంతిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సురక్షితంగా ఎలా బయట పడాలి, తొక్కిసలాటలో ప్రాణాలు ఎలా రక్షించుకోవాలి, CPR చేసే విధానం, Emergency evacuation కళ్లకు కట్టినట్టు ప్రజలకు demo చూపించారు పోలీసులు. ఇందులో భాగంగా పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ రెవెన్యూ, వైద్యశాఖ ఆర్ఎంబి, APSPDCLకు సంబంధించిన ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా శివరాత్రి పర్వదినం కంటే ముందు పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలంలోని మల్లన్న స్వామిని దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోంది. పెద్ద ఎత్తున మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తదితర రాష్ట్రాల నుంచి తండోప తండాలుగా తరలివస్తున్నారు. అంతేకాకుండా ఒక్క కర్ణాటక రాష్ట్రం నుండి ఏకంగా 1000కి పైగా బస్సులు ప్రతి నిత్యం వస్తుండడం విశేషం.



















