PM Modi : అమరావతి : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన టూర్ ను ఖరారు చేసింది. షెడ్యూల్ ను శనివారం ప్రకటించింది . అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు సీఎం ఆదేశాల మేరకు సీఎస్ విజయానంద్. ఇందులో భాగంగా నరేంద్ర మోదీ అక్టోబర్ 16న కర్నూల్ జిల్లాలో పర్యటిస్తారు. ఆరోజు ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరుతారు. అక్కడి నుంచి నేరుగా కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉదయం 10.30 గంటలకు చేరుకుంటారని తెలిపారు సీఎస్. ఉదయం 11.10 గంటలకు రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు ప్రధానమంత్రి చేరుకుంటారు.
PM Modi AP Visit
అక్కడి నుంచి ఉదయం 11.45 గంటలకు ప్రముఖ శైవ క్షేత్రంగా పేరు పొందిన , కోరిన కోర్కెలు తీర్చే శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామి వారికి పూజలు చేశారు. అక్కడి నుండి నేరుగా మధ్యాహ్నం 1.40 గంటలకు సున్ని పెంటకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు వెళతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాగ మయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన చేస్తారు నరేంద్ర మోదీ. అనంతరం కర్నూల్ లో సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ పేరుతో సాయంత్రం 4 గంటల వరకు జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారని విజయానంద్ వెల్లడించారు.
Also Read : TG High Court Clear Orders : స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్


















