PM Modi : న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు సంభవించింది. పలువురు మృతి చెందగా పెద్ద ఎత్తున తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రులలో చేర్చారు. మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నేరుగా ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు .ఈ ఘటన సోమవారం రోజు ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో నెమ్మదిగా కదులుతున్న వాహనంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
PM Modi Meet Delhi Bomb Blast Victims
నరేంద్ర మోదీ పరామర్శ కారణంగా ఆస్పత్రి చుట్టూ , పరిసరాలలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. భూటాన్ లో పర్యటించిన అనంతరం ప్రధాని నేరుగా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను చూసి చలించి పోయారు. వారిని ఓదార్చారు. తమకు పూర్తిగా సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైద్యులు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వారితో చాలా సేపు మాట్లాడారు నరేంద్ర మోదీ. ఉన్నతాధికారులు, ఆస్పత్రి యాజమాన్యం పూర్తి వివరాలు పీఎంకు తెలిపారు. ఇదిలా ఉండగా ఘటన జరిగిన వెంటనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యంగా ఉండమని చెప్పారు.
Also Read : Minister Anitha Shocking Comments : డ్రగ్స్ నిర్మూలనపై దృష్టి పెట్టాలి


















