PM Modi : నంద్యాల జిల్లా : భారత దేశ ప్రధానమంత్రి తొలిసారిగా ఏపీలోని నంద్యాల జిల్లాలో కొలువుతీరిన ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీశైలం సన్నిధికి చేరుకున్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ కల్పించారు. తన పర్యటనలో భాగంగా మోదీ (PM Modi) కర్నూల్, నంద్యాల జిల్లాలలో పర్యటిస్తారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం నన్నూరు చెక్ పోస్ట్ సమీపంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
PM Modi Visit
సమావేశానికి హాజరయ్యే ముందు, ప్రధానమంత్రి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామి ,శక్తి పీఠంలోని భ్రమరాంబికా దేవికి ప్రార్థనలు చేయడానికి పవిత్ర శ్రీశైలం ఆలయాన్ని సందర్శించారు. మోడీ ఢిల్లీ నుండి నేరుగా కర్నూలు విమానాశ్రయానికి చేరుకుని శ్రీశైలం దేవస్థానానికి వెళ్లారు . దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత, ఆయన శ్రీశైలంలోని శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. తరువాత, మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో, ప్రధానమంత్రి కర్నూలు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత, ఆయన హెలికాప్టర్‌లో కర్నూలు విమానాశ్రయానికి తిరిగి వెళ్లి ఢిల్లీకి బయలు దేరుతారు.
ప్రధాని మోదీ తన పర్యటన సందర్భంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రూ. 13,429 కోట్ల విలువైన అనేక ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఇందులో రూ. 9,449 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతాయి. రూ.1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అదనంగా రూ. 2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.
Also Read : Bandaru Sravani – NDA Govt Strong Focus : గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు : బండారు



















