కేరళ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా కేరళ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తను ఆడక పోయి ఉండి ఉంటే టీం ఇండియా గెలిచి ఉండేది కాదన్నారు. ఒకానొక దశలో జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత అనుకోకుండా తిరిగి జట్టులోకి వచ్చాడు. కానీ ఎవరూ ఊహించని రీతిలో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడని ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి.
ప్రపంచ కప్‌లో మనం సంజు శాంసన్‌ను చూశాం. మనందరం తన ఆటతీరును చూసి మరంత ఆనందానికి లోనయ్యాం, క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్న కొద్దీ, అలాగే నాకౌట్ మ్యాచ్‌లు సమీపిస్తున్న వేళ,
సంజు శాంసన్ ప్రదర్శన అత్యున్నత స్థాయికి చేరిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆరంభం నుండి చివరి వరకు, అతని ఆత్మవిశ్వాసం, తీవ్రత పెరుగుతూనే వచ్చాయన్నారు పీఎం. ఇదే ఒక గొప్ప ఆటగాడికి నిజమైన నిదర్శనం అని పేర్కొన్నారు . జట్టుకు తన అవసరం ఉన్నప్పుడు, అతను జట్టు కోసం తన అత్యుత్తమ ప్రదర్శనను అందించడం మామూలు విషయం కాదన్నారు మోదీ. రాబోయే రోజుల్లో తను మరింత రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా తాజాగా ఇండియాలో జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో సత్తా చాటాడు సంజు శాంసన్. తను 5 ఇన్సింగ్స్ లు ఆడి 321 రన్స్ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.



















