PM Modi : కర్నూలు జిల్లా : ముందు చూపు కలిగిన నేతలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi). గురువారం సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది గుజరాత్ సోమనాధ్ ఆలయం ఉందని, అక్కడే తాను పుట్టానని చెప్పారు. ఇక రెండో జ్యోతిర్లింగం శ్రీశైల మల్లిఖార్జున స్వామిదని, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నానని దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించానని అన్నారు. ఛత్రపతి శివాజీ ధ్యాన మందిరాన్ని కూడా దర్శించానని, ఆయనకు అల్లమ్మ ప్రభు, అక్క మహాదేవి లాంటి శివభక్తులకు ప్రణామాలు సమర్పించినట్లు తెలిపారు నరేంద్ర మోదీ.
PM Modi Praises CM Chandrababu, Pawan Kalyan
ఈ నేల ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి లాంటి ధీరులకు వినమ్ర పూర్వక నమస్కారం చేస్తున్నానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం అని పేర్కొన్నారు. యువత ఎంతో చైతన్యవంతులుగా ఉన్నారంటూ ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి. ఏపీ సర్కార్ అభివృద్దికి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. గత 16 నెలల్లో డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఏపీలో ప్రగతి వేగంగా జరుగుతోందని చెప్పారు నరేంద్ర మోదీ. ఢిల్లీ, అమరావతిలు రెండూ వేగంగా అభివృద్ది దిశగా వెళ్తున్నాయని అన్నారు. స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తైన 2047 నాటికి భారత్ వికసిత్ భారత్ గా తయారవుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.
Also Read : People Shocking Bigg Boss Show : మాటీవీ బిగ్ బాస్ షోపై ఫిర్యాదు


















