PM Modi : నంద్యాల జిల్లా : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఏపీలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన నంద్యాల జిల్లాలోని దేశంలోనే అత్యంత ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని ప్రత్యేకంగా దర్శించారు. ఆయన రాకతో ఆలయ ప్రాంగణం, పరిసరాలలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. కనీవిని ఎరుగని రీతిలో సెక్యూరిటీ కల్పించారు. ఎక్కడ చూసినా పోలీసులే మోహరించడంతో భక్తులు మోదీని చూసేందుకు ఎగబడ్డారు. ప్రధానికి ఘన స్వాగతం పలికారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు. ప్రోటోకాల్ ప్రకారం ఈ ఇద్దరు ఆయన వెంట ఉన్నారు. మరో వైపు ఆచార్యులు, పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.
PM Modi Srisailam Visit Updates
ఆయన పట్టు వస్త్రాలు ధరించి , కాషాయ కలర్ తో తళుక్కున మెరిశారు . ఆయన ముందుకు రాగా వెనుక నుంచి వచ్చారు సీఎం , డిప్యూటీ సీఎంలు. హెలిప్యాడ్ నుంచి నేరుగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్లారు. మల్లన్న స్వామికి అభిషేకం చేశారు నరేంద్ర మోదీ. ఈ సందర్బంగా ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. నిండు నూరేళ్లు చల్లంగా ఉండాలని దీవెనలు అందించారు.
Also Read : PM Modi Interesting Visit to Srisailam : మల్లన్న సన్నిధిలో ప్రధాని నరేంద్ర మోదీ
















