PM Modi : టియాన్‌జిన్ : పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో తన సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi). ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడానికి ఆదివారం ఇద్దరు నాయకులు విస్తృత చర్చలు జరిపారు. 2.8 బిలియన్ల ప్రజల సంక్షేమం భారత్ , చైనా మధ్య సహకారంతో ముడిపడి ఉందని మోదీ అన్నారు. ట్రంప్ పరిపాలన సుంకాల వివాదం కారణంగా ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర చైనాలోని ఈ నగరంలో షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య చర్చలు జరిగాయి.
PM Modi Key Comments on India-China Relations
మోడీ తన రెండు దేశాల పర్యటనలోని రెండవ దశలో నిన్న సాయంత్రం జపాన్ నుండి ఇక్కడకు వచ్చారు. 2020 మే నెలలో ప్రారంభమైన తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం తర్వాత భారత ప్రధానమంత్రి చైనాకు చేసిన తొలి పర్యటన ఇది. గత ఏడాది అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో చైనా అధ్యక్షుడితో ప్రధాని చర్చలు జరిపారు, తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభనను ముగించడానికి భారతదేశం, చైనా ఒక అవగాహనకు వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఇది జరిగింది.
గత ఏడాది విరమణ ప్రక్రియ తర్వాత సరిహద్దులో శాంతి, స్థిరత్వం ఉందని మోడీ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు తిరిగి ప్రారంభించ బడుతున్నాయని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కైలాష్ మానసరోవర్ యాత్ర పునః ప్రారంభం గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. ప్రధానమంత్రి జిన్‌పింగ్‌ను అభినందించారు. టియాంజిన్ పర్యటనకు ముందు, ప్రపంచ ఆర్థిక క్రమానికి స్థిరత్వాన్ని తీసుకు రావడానికి భారతదేశం, చైనా కలిసి పని చేయడం ముఖ్యమని అన్నారు.
Also Read : Air India Flight Fired : ఇంజిన్ లో మంటలు తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్

















