PM Modi : న్యూఢిల్లీ – ఉగ్రవాదం ఎక్కడున్నా ప్రమాదమని, దానిని నిర్మూలించేంత వరకు శాంతి అనేది అంటూ ఉండదన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ (PM Modi). ఆపరేషన్ సిందూర్ తో మన దేశం స్టాండ్ ఏమిటి అనేది యావత్ ప్రపంచానికి తెలిసి పోయిందన్నారు. తాము కావాలని ఎవరితోనూ యుద్దం చేయాలని అనుకోమని పేర్కొన్నారు. దానిని నిర్మూలించేంత దాకా తాము నిద్ర పోమని, ఇతరులను కూడా పోనివ్వమని స్పష్టం చేశారు.
PM Modi Shocking Comments
మంగళవారం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియా రాజీలేని వైఖరిని చాటి చెప్పడం జరిగిందని చెప్పారు. రక్తాన్ని చిందించే వారికి ఏ ప్రదేశం సురక్షితంగా లేదన్నారు. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. యుద్దం ఎన్నటికీ మంచిది కాదన్నారు.
మన దేశం శాంతి మంత్రం జపిస్తుందన్నారు. శ్రీ నారాయణగురు, మహాత్మా గాంధీల శతాబ్ది ఉత్సవాల సందర్బంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఇవాళ దేశం ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా ముందుకు కదులుతోందన్నారు. ఈ సమయంలో యుద్దం చేయడం అనివార్యం కాదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల భారత్ సత్తా ఏమిటో ప్రపంచం దగ్గరుండి చూసిందన్నారు. ఒకవేళ అమెరికా గనుక జోక్యం చేసుకోక పోతే ఇప్పటికే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి ఉండేదన్నారు. తాము కావాలని ఎవరితోనూ యుద్దానికి దిగబోమని మరోసారి స్పష్టం చేశారు మోదీ.
Also Read : రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం ఆహ్వానం


















