PM Modi : చైనా – భారత్, చైనా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా ఇండియా, చైనా దేశాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున సుంకాలను విధించడం పట్ల ఈ ఇద్దరు కీలక నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ఆదివారం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఇద్దరి మధ్య కీలక అంశాల గుర్చించి చర్చించారు. సుదీర్ఘ కాలం అంటే ఏడు సంవత్సరాల విరామం తర్వాత మోడీ చర్చించడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.
PM Modi Key Meeting With China President
చైనా పర్యటనలో రెండు రోజుల పాటు పర్యటించేందుకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు అమెరికా తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. ఈ తరుణంలో ప్రపంచంలో బలమైన, అత్యంత శక్తివంతమైన దేశాలుగా రష్యా, అమెరికా, చైనా కొనసాగుతున్నాయి. భారత్ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోంది. ఈ తరుణంలో ఇండియా ఇటు రష్యా అటు చైనాతో దోస్తీ కట్టడంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు ఎటూ పాలు పోవడం లేదు. నిన్నటి దాకా ఉప్పు నిప్పు లాగా ఉన్న చైనా, భారత్ దోస్తీ చేస్తే ఇక చుక్కలు చూపించడం ఖాయం.
ఇక ఈ చర్చలలో ఇద్దరు నాయకులు భారతదేశం-చైనా ఆర్థిక సంబంధాలను సమీక్షించి, తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం తరువాత తీవ్ర ఒత్తిడికి గురైన సంబంధాలను మరింత సాధారణీకరించే చర్యలపై చర్చించారు.
Also Read : YS Rajasekhar Reddy Death Anniversary : సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి
















