PM Modi Special Award : మోదీకి ఘనా దేశ అత్యున్న‌త పుర‌స్కారం

ఈ అవార్డుతో మ‌రింత బాధ్య‌త‌ను పెంచింది

Hello Telugu - PM Modi Special Award

Hello Telugu - PM Modi Special Award

PM Modi : ఘ‌నా – ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఘ‌నా దేశం అత్యున్న‌త‌మైన పుర‌స్కారం ఆఫీస‌ర్ ఆఫ్ ది ఆర్డ‌ర్ ఆఫ్ ది స్టార్ అవార్డును బ‌హూక‌రించింది. ఈ సంద‌ర్బంగా ఘ‌నా ప్ర‌జ‌ల‌కు , ప్ర‌భుత్వానికి ధ‌ణ్య‌వాదాలు తెలిపారు మోదీ. ఈ అవార్డుతో త‌న‌పై మ‌రింత బాధ్య‌త‌ను గుర్తు చేసింద‌న్నారు. ఈ పుర‌స్కారాన్ని 143 కోట్ల భార‌తీయులంద‌రికీ అంకితం ఇస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇరు దేశాల మ‌ధ్య స్నేహ సంబంధాలు మ‌రింత బ‌లోపేతం అవుతాయ‌ని పేర్కొన్నారు.

PM Modi Gets Special Award

త‌న‌కు అత్యున్న‌త పౌర పుర‌స్కారం కోసం త‌న‌ను ఎంపిక చేసినందుకు తాను స‌దా రుణ‌ప‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi). ఈ గౌర‌వం ద‌క్కినందుకు త‌న‌కు చెప్ప‌లేని ఆనందంగా ఉంద‌న్నారు. భ‌విష్య‌త్తులో తాను మ‌రింత ఉత్సుక‌త‌తో ప‌ని చేసేందుకు ప్రేర‌ణ‌గా ఈ అవార్డు నిలుస్తుంద‌న్నారు.

ఇరు దేశాలు బ‌ల‌మైన వ్యాపార‌, వాణిజ్య‌, సాంస్క‌తిక ప‌రంగా మ‌రింత సంబంధాలు పెంపొందించాల‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ. యావ‌త్ ప్ర‌పంచం ప్ర‌స్తుతం భార‌త్ వైపు చూస్తోంద‌న్నారు. దీనికి కార‌ణం తాము అనుస‌రిస్తున్న విదేశాంగ విధానమేన‌ని పేర్కొన్నారు. తాము ఏ దేశంతోనూ యుద్దాన్ని కోరుకోవ‌డం లేద‌న్నారు. పాకిస్తాన్ కావాల‌ని క‌య్యానికి కాలు దువ్వుతోంద‌న్నారు. అందుకే తాము గ‌త్యంత‌రం లేక పాకిస్తాన్ పై ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. చివ‌ర‌కు కాళ్ల బేరానికి రావ‌డంతో తాము కాల్పుల విర‌మణ‌కు ఓకే చెప్ఆప‌మ‌న్నారు మోదీ.

Also Read : Minister Kandula Durgesh- Tourism Growth : ఏపీని టూరిజం హ‌బ్ గా మారుస్తాం – దుర్గేష్

Exit mobile version