PM Modi : న్యూఢిల్లీ – ఫిజీ, ఇండియా మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఒప్పందం చేసుకోవడం జరిగిందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi). ఢిల్లీ పర్యటనలో భాగంగా ఫిజీ దేశ ప్రధానమంత్రి రబుకా ఇక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆయన ప్రధానిని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఇందులో భాగంగా భారతదేశం, ఫిజి 7 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి; రక్షణ సంబంధాలను బలోపేతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికకు సంతకం చేశాయి. వివిధ రంగాలలో భారతదేశంతో ఫిజి సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోక్స్ పెడుతున్నట్లు తెలిపారు.
PM Modi Key Comments
ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడానికి చర్చలు జరిపినందున శాంతియుత , సమగ్ర ఇండో-పసిఫిక్ కోసం సంయుక్తంగా పని చేయడానికి అంగీకరించాయి. భారతదేశం, ఫిజి సముద్రాలు వేరుగా ఉండవచ్చు, కానీ మా ఆకాంక్షలు ఒకే పడవలో ప్రయాణిస్తాయి అని సమావేశం తర్వాత మోడీ అన్నారు. సముద్ర భద్రత, వాణిజ్యం, ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీ, సామర్థ్య నిర్మాణం వంటి రంగాలలో భారతదేశంతో ఫిజి సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయారిటీ ఇస్తామన్నారు ఫిజీ పీఎం రబూకా. గత కొన్ని సంవత్సరాలుగా, పసిఫిక్ ప్రాంతంలో తన వ్యూహాత్మక బలాన్ని విస్తరించడానికి చైనా అవిశ్రాంత ప్రయత్నాల నేపథ్యంలో, పసిఫిక్ ద్వీప రాష్ట్రాలతో రక్షణ , భద్రతా సహకారాన్ని విస్తరించాలని భారతదేశం చూస్తోంది.
Also Read : Trump Big Shock : ఫెడ్ గవర్నర్ లిసా కుక్ పై ట్రంప్ వేటు
















