PM Modi Important Call : కాశీ త‌మిళ సంగ‌మంలో పాల్గొనాలి : మోదీ

త‌మిళం నేర్చుకునే వారికి సద‌వ‌కాశం

Hello Telugu - PM Modi Important Call

Hello Telugu - PM Modi Important Call

PM Modi : త‌మిళ‌నాడు : దేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ (PM Modi) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాశీ-తమిళ సంగమం లో పౌరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. తమిళ భాష‌ నేర్చుకోవడానికి ఇది ఒక అవకాశం అని పేర్కొన్నారు. తమిళ భాష‌, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడంపై దృష్టి సారించాల‌న్నారు. ఇదిలా ఉండ‌గా కాశీ త‌మిళ స‌మ్మేళ‌న ఉత్స‌వం డిసెంబ‌ర్ 2వ తేదీన ప్ర‌సిద్ద‌మైన పుణ్య క్షేత్రం వార‌ణాసిలో ప్రారంభం కానుంద‌ని తెలిపారు పీఎం. తమిళం నేర్చుకునే అవకాశాన్ని స్వీకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ప్రోత్సహించారు, ఈ కార్యక్రమాన్ని భారతదేశం ఉమ్మడి సాంస్కృతిక వారసత్వ వేడుకగా అభివర్ణించారు.

PM Modi Calls

ఆదివారం తన నెలవారీ ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో కీల‌క సూచ‌న‌లు చేశారు. కాశీ-తమిళ సంగమం అద్భుతంగా ప్రారంభం కానుంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ఈ సంవత్సరం కాశీ-తమిళ సంగమం చాలా ఆసక్తికరమైన ఇతివృత్తాన్ని కలిగి ఉందని చెప్పారు. త‌మిళం నేర్చుకునేందుకు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని పురాతన భాష, పురాతన నగరాల్లో ఒకటిగా అభివర్ణించారు. తమిళ భాషతో అనుబంధం ఉన్న వారందరికీ కాశీ-తమిళ సంగమం ఒక ముఖ్యమైన వేదికగా మారిందని ఆయన అన్నారు. కాగా కాశీ ప్రజలతో మాట్లాడినప్పుడల్లా వారు కాశీ-తమిళ సంగమంలో భాగం కావడం ఆనందిస్తారని చెబుతారని తెలిపారు. అంతే కాకుండా పుదుచ్చేరి, మలబార్ తీరంలోని ప్రజలు గొప్ప చారిత్రక వారసత్వం కలిగిన నావికాదళ నౌకకు ఐఎన్ఎస్ మహే అని పేరు పెట్టడం పట్ల ఆనందంగా ఉన్నారని కూడా ప్రధాని అన్నారు.

Also Read : CPI Narayana Shocking Comments : చంపినా మ‌రికొంద‌రు హిడ్మాలు పుట్టుకు వ‌స్తారు

Exit mobile version