India : భారత్‌లో త్వరలోనే 6G సేవలు అందుబాటులోకి రానున్నాయి అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2025 చివరి నాటికి దేశీయంగా తయారు చేసిన మొదటి సెమీకండక్టర్ చిప్ విడుదల కానుందని ఆయన వెల్లడించారు.
India Growth – 5G Network Updates
గత ఐదు నుండి ఆరు దశాబ్దాలుగా భారత్ సెమీకండక్టర్ రంగంలో అనేక అవకాశాలను కోల్పోయిందని ప్రధాని పేర్కొన్నారు. “50-60 ఏళ్ల క్రితమే భారత్‌లో సెమీకండక్టర్ తయారీ ప్రారంభం కావాల్సింది. కానీ ఆ అవకాశాన్ని కోల్పోయాం. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఈ ఏడాది చివరికి దేశీయంగా తయారైన తొలి చిప్ మార్కెట్లోకి రానుంది” అని మోదీ తెలిపారు.
అంతేకాకుండా దేశ సాంకేతిక రంగ అభివృద్ధి వేగవంతమవుతోందని, మేడ్ ఇన్ ఇండియా 6G నెట్‌వర్క్ అభివృద్ధి కూడా అదే దిశగా సాగుతోందని ఆయన చెప్పారు.
Also Read : New US Tarrifs Sensational : భారత్‌పై అమెరికా 50% సుంకాలు అమల్లోకి



















