Tejashwi Yadav : బీహార్ : ఆర్జేడీ పార్టీ సీనియర్ నేత , మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ సందర్బంగా రాష్ట్రంలో ప్రజలు తప్పకుండా మార్పును కోరుకుంటున్నారని , బీహార్ లో ఇప్పటి వరకు ఎన్డీయే సర్కార్ వల్ల ఒరిగింది ఏమీ లేదని తేలి పోయిందన్నారు. ఆ విషయాన్ని జనం గుర్తించారని చెప్పారు. ఇవాళ ఎక్కడికి వెళ్లినా మహా కూటమికి మద్దతు ఇస్తున్నారని, ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. ఈ దేశంలో ఓట్ చోరీ ఎలా జరిగిందో తెలిసి పోయిందన్నారు. ఇదే విషయాన్ని తాము పదే పదే ప్రస్తావిస్తూ వచ్చామని చెప్పారు. అంతే కాకుండా ఆధారాలతో సహా ఈసీకి సమర్పించడం జరిగిందన్నారు తేజస్వి యాదవ్.
Tejashwi Yadav Comments
ఇదిలా ఉండగా మహా ఘట్ బంధన్ నుంచి తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుగా ప్రకటించినందుకు, తన గెలుపు కోసం అహర్నిశలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలకు ధన్యవాదాలు తెలిపారు మాజీ డిప్యూటీ సీఎం. తొలి దశలో జరిగిన పోలింగ్ సరళి గురించి కూడా తేజస్వి యాదవ్ స్పందించారు. పూర్తిగా తమ వైపు ఓటర్లు మొగ్గు చూపారని తమకు తెలిసి పోయందన్నారు. ఇలా ఎంతకాలం మోదీ, నితీష్ కుమార్, అమిత్ షా ప్రజలను మభ్య ఎట్టాలని చూస్తారంటూ ప్రశ్నించారు. వారి వైపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ముందుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు తేజస్వి యాదవ్.
Also Read : CM Revanth Reddy New Innovation : వచ్చే ఏడాది సర్కార్ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం
















