Peddi : హైదరాబాద్ : టాలీవుడ్ దర్శకుడు బుచ్చిబాబు సన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను దర్శకత్వం వహిస్తున్న చిత్రం పెద్ది మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చాడు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తమ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడని, ఇందులోని పాటలు సూపర్ గా వచ్చాయని అన్నాడు. ఈ మూవీలో స్టార్ హీరో రామ్ చరణ్ తో పాటు ముంబై ముద్దుగుమ్మ జాహ్నవి కపూర్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. ప్రధానంగా బుచ్చిబాబు సన టేకింగ్, మేకింగ్ పెద్ది (Peddi) మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచింది. తను గతంలో కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ తో ఉప్పెన మూవీ తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Peddi Movie Updates
ఇందులోని సంగీతం, పాటలు యువతీ యువకులను, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా చేసింది. ప్రస్తుతం తన స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. తను గురువుగా భావించే సుకుమార్ సలహాలు, సూచనలు కూడా ఈ సినిమా కోసం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది పక్కన పెడితే ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు నటుడు రామ్ చరణ్. తను తమిళ దర్శకుడు శంకర్ తో తీసిన మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆర్ఆర్ఆర్ తర్వాత తనకు చెప్పుకోదగ్గ మూవీ ఏదీ లేదు. మరో వైపు తన తండ్రి చిరంజీవి , నయనతారతో కలిసి స్టెప్పులతో హోరెత్తిస్తున్నారు. తండ్రీ కొడుకులకు రెండు సినిమాలు అత్యంత కీలకంగా మారాయని చెప్పక తప్పదు.
Also Read : Supreme Court Shocking BC Reservation : బీసీ కోటా పెంపు పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
