హైదరాబాద్ : దమ్మున్న దర్శకుడిగా పేరు పొందిన హరీశ్ శంకర్ కీలక కామెంట్స్ చేశారు. తాను ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. దీనిపై కీలక అప్ డేట్ ఇచ్చాడు. ఇది కూడా రీ మేక్ అంటూ వస్తున్న ప్రచారం పై స్పందించాడు. ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆదివారం తను మీడియాతో మాట్లాడాడు. పవన్ మూవీ రీమేక్ కాదని ఇది స్ట్రెయిట్ సినిమా అని ప్రకటించాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సింగిల్ ను రిలీజ్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రధానంగా పవర్ స్టార్ తో దుమ్ము రేపుతూ నటించింది..స్టెప్పులతో హోరెత్తించింది శ్రీలీల.
ఇదే సమయంలో సినిమా జాప్యం కావడానికి కూడా కారణం చెప్పాడు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ సుదీర్ఘ జాప్యానికి పవన్ కళ్యాణ్ కారణం కాదన్నాడు. అది నా సొంత నిర్ణయ రాహిత్యం వల్లే జరిగిందని చెప్పాడు. తనకు పుల్ సపోర్ట్ చేయడం పట్ల పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ తెలిపాడు. ఆయన సహకరించడం వల్లే షూటింగ్ సజావుగా, ముందుగానే పూర్తయిందని చెప్పాడు దర్శకుడు. పవన్ కళ్యాణ్ తో తీస్తున్న ఈ మూవీ హరీష్ శంకర్ కు ఇది రెండోది. తను గతంలో గబ్బర్ సింగ్ తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కోట్లు కుమ్మరించేలా చేసింది. ప్రధానంగా పవన్ కళ్యాన్ సినీ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.


















