అంచ‌నాలు పెంచుతున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో రెండోసారి హ‌రీష్ శంక‌ర్

hellotelugu-UstadBhagatSingh

హైద‌రాబాద్ : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌నంగా మారారు. ఓ వైపు ఉప ముఖ్య‌మంత్రిగా విధులు నిర్వ‌హిస్తూనే ఇంకో వైపు సినిమాల‌పై దృష్టి సారించాడు. ద‌మ్మున్న ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన హ‌రీష్ శంక‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో తీసిన మూవీ సెన్సేష‌న్ హిట్ అయ్యింది. తాజాగా ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో హిట్ మూవీ రానుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ సాంగ్ దేఖ్ లేంగే సాలా అనే పాట దుమ్ము రేపుతోంది. సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. గ‌తంలో ఇదే ద‌ర్వ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన సినిమాలు అంత‌గా ఆడ‌క పోయిన స‌మ‌యంలో తీసిన గ‌బ్బ‌ర్ సింగ్ సంచ‌ల‌నం సృష్టించింది. బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొట్టింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినీ కెరీర్ లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.

తాజాగా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ రెండోది. దీనిని యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందించే ప‌నిలో ప‌డ్డారు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్. ఈ సినిమా గురించి కీల‌క అప్ డేట్ ఇచ్చారు మూవీ మేక‌ర్స్. దీనిని ఈ ఏడాది వేస‌వి కాలంలో విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఫ్యాన్స్ ఎంతో సంబుర ప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ కు సంబంధించి చాలా కాలం నుంచి వ‌స్తున్న పుకార్ల‌కు చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు డైన‌మిక్ డైరెక్ట‌ర్. పూర్తిగా వినోదం ఉండేలా చూస్తున్నామ‌ని తెలిపాడు హ‌రీష్ శంక‌ర్. ఐతే ఈ ఇద్ద‌రి మ‌ధ్య కొంత గ్యాప్ రావ‌డానికి ఎల‌క్షన్స్ రావ‌డంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దానిపై ఫోక‌స్ పెట్టాడు. దీంతో సినిమా వ‌చ్చేందుకు లేట్ అయ్యింది.

Exit mobile version