OG : హైదరాబాద్ : డీవీవీ దానయ్య భారీ ఖర్చుతో నిర్మించిన చిత్రం ఓజీ (OG). దీనిని సుజిత్ తీశాడు. దమ్మున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ అందించాడు. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజు తొలి షో నుంచే ఓజీ సూపర్ టాక్ తో దుమ్ము రేపుతోంది. ఇందులో పవర్ స్టార్ , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్ , ప్రకాశ్ రాజ్ లు కీలక పాత్రలు పోషించారు. పెద్ద ఎత్తున కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఓజీ. మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఈ సినిమా సక్సెస్ కావడం తో పవన్ కళ్యాణ్ తెగ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాను కోట్లాది అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత డీవీవీ దానయ్య.
Pawan Kalyan OG Movie OTT Updates
ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున సక్సెస్ టాక్ రావడంతో ఓజీని చేజిక్కించు కునేందుకు పోటీ పడ్డాయి ఓటీటీ సంస్థలు. చివరకు నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుందని సమాచారం. నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం అక్టోబర్‌లో లేదా నవంబర్ మొదటి వారంలో OTTకి వెళ్లే అవకాశం ఉంది. అయితే తేదీకి అధికారిక నిర్ధారణ లేదన్నారు. నిర్మాతలు అధికారికంగా సినిమా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన వెంటనే తాము దీనిని అప్‌డేట్ చేస్తామని ప్రకటించారు డీవీవీ దానయ్య. మ్యూజిక్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ టాప్ లో ఉండడంతో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
Also Read : Sonia Gandhi Fired on PM Modi : పీఎం మోదీ మౌనం సోనియా గాంధీ ఆగ్రహం



















