Pawan Kalyan : అమరావతి : రాష్ట్రంలోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ప్రతి పల్లెకు సదుపాయం ప్రతి కుటుంబానికి సౌభాగ్యం అందించాలని కంకణం కట్టుకున్నామన్నారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించామన్నారు. ఇదే క్రమంలో పల్లె పండగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు పవన్ కళ్యాణ్. ప్రతి గ్రామాన్ని ఒక అభివృద్ధి చిహ్నంగా తీర్చిదిద్దే సంకల్పంతో ప్రధాని మోదీ సహకారంతో ముందుకు సాగుతున్నామన్నారు.
DY CM Pawan Kalyan Key Update
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పల్లెల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రూపొందించిన అద్భుత కార్యక్రమం పల్లె పండగ అని అన్నారు పవన్ కళ్యాణ్. గ్రామీణ అభివృద్ధిలో ఈ కార్యక్రమం గొప్ప మైలురాయిగా నిలిచి పోతుందన్నారు డిప్యూటీ సీఎం. ప్రజల సహకారంతో ప్రణాళికబద్దంగా ముందడుగు వేసి గొప్ప విజయం సాధించామని చెప్పారు. పల్లె పండగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ పల్లె పండగ 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పల్లె పండగ 1.0 కార్యక్రమం ద్వారా రూ. 2,525 కోట్ల విలువైన పనులు టైం బౌండ్ విధానంలో పూర్తి చేశాం అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం అన్నారు. పాడి రైతుల కోసం 22,500 మినీ గోకులాలు ఏర్పాటు చేశామన్నారు.
Also Read : CM Revanth Reddy Clear Instructions : తెలంగాణ ఎంపీలు సమస్యలపై గళమెత్తాలి
















