Pawan Kalyan : అమరావతి : భారతీయ ధర్మం, సంస్కృతి స్త్రీ ఔన్నత్యాన్ని చాటుతాయని, పుస్తకాలు చదవడం వల్ల మానసిక దృఢత్వం ఏర్పడుతుందని అన్నారు ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). మహిళల శక్తిని చాటి చెప్పిన పుస్తకం ఆమె సూర్యుడిని కబళించింది బాగుందని అన్నారు. తాను వామపక్ష వాద పుస్తకాలతో పాటు జాతీయ వాదం గురించి చెప్పే పుస్తకాలనూ కూడా చదువుతానని చెప్పారు. మహిళ సాధికారత విషయంలో లక్ష్మీ ముర్డేశ్వర్ పురి మార్గం అనుసరణీయం అన్నారు. శనివారం జరిగిన కార్యక్రమంలో ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరు పుస్తకాలను చదవడం పనిగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. దీని వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు.
AP Deputy CM Pawan Kalyan Comments
స్త్రీ శక్తి అసమాన్యమైనది. అనుకుంటే సూర్యుడిని సైతం మింగేయగలిగేంత అమోఘమైన శక్తి కలిగి ఉంటారని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ధర్మం మహిళలకు ఇచ్చే స్థానం అత్యున్నతమైనదని పేర్కొన్నారు. తనకు పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు అని చెప్పారు. మొదటిగా తనకు తన తల్లి బుచ్చిబాబు రాసిన ‘చివరకు మిగిలేది’ అనే పుస్తకం ఇచ్చారని తెలిపారు. ఆమె సూర్యుడిని కబళించింది అనే పుస్తకం రాసి లక్ష్మీ ముర్డేశ్వర్ పురి అత్యున్నత పదవులు నిర్వహించి, మరో వైపు పుస్తక రచన చేయడం గొప్ప విషయం అని ప్రశంసించారు. లక్ష్మీ ముర్డేశ్వర్ పురి లాంటి ఎందరో ఉన్నతమైన నారీమణుల ఆలోచన మహిళా సాధికారతకు అద్దం పడుతుందన్నారు.
Also Read : Rahul Gandhi Fired on PM Modi : ప్రధాని మోదీపై భగ్గుమన్న రాహుల్ గాంధీ
















