Pawan Kalyan : అమరావతి : కేంద్రం సహకారంతో రాబోయే రోజుల్లో పల్లెలను అన్ని రంగాలలో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). కాకినాడ, మచిలీపట్నం లోక్ సభ సభ్యులతో సమావేశమయ్యారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాలం సమావేశాలలో అనుసరించాల్సిన విధానాలపై దిశా నిర్దేశం చేశారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ ఈ కీలక మీటింగ్ లో పాల్గొన్నారు. అర్ధరాత్రి దాకా డిప్యూటీ సీఎం చర్చించారు. జాతీయ ప్రయోజనాలను ఉద్దేశించిన అంశాలపై చర్చల్లో పాల్గొనేందుకు పకడ్బందీగా సంసిద్ధం కావాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
DY CM Pawan Kalyan Key Comments
రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమయ్యే విధంగా సంబంధిత శాఖల మంత్రులతో సమావేశమై, వివరాలు అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతికి సంబంధించిన కేంద్రం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని అన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ కేంద్ర పథకాల ద్వారా మంజూరయ్యే నిధులు, ఈ ఆర్ధిక సంవత్సరం రావాల్సిన నిధులువివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అందిస్తారని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. వాటిని పరిశీలించి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకు వెళ్ళాలని, వాటిని త్వరితగతిన మంజూరు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం.
Also Read : DK Suresh Sensational Comments : ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు బీజేపీ కుట్ర















