Pawan Kalyan : అమరావతి : పాలకొండ ఎమ్మెల్యే ఎన్. జయకృష్ణ మర్యాద పూర్వకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదలను కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన తన నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రధానంగా వండువ ఇనాం భూముల రైతుల గురించి ప్రత్యేకంగా డిప్యూటీ సీఎంతో (Pawan Kalyan) ప్రస్తావించారు. ఈ సందర్భంగా వారికి న్యాయం చేయాలని కోరారు. అంతే కాకుండా రాష్ట్ర సర్కార్ తీసుకు వచ్చిన కొత్త పథకం సుఖీభవ జాబితాలో చేర్చాలని విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించారు పవన్ కళ్యాణ్. తక్షణమే జాబితాను సవరించి న్యాయం చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం.
DY CM Pawan Kalyan Key Comments
ఈ సందర్బంగా నేరుగా పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, వ్యవసాయ ఉన్నతాధికారులకు. తక్షణమే వండువ ఇనాం భూములు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఎలాంటి ఆలస్యం జరగడానికి వీలు లేదని స్పష్టం చేశారు. జాబితా సవరించి న్యాయం చేయాలన్నారు. ఇనాం భూములు, డీకేటీ పట్టాలు ఉన్న రైతులకు కూడా అన్నదాతా సుఖీభవ వర్తింప చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి రైతుకీ సాయం అందాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లా, వీరఘట్టం మండలం, వండువ గ్రామ పరిధిలో ఇనాం భూములు సాగు చేసుకుంటున్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తించేలా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read : CM Revanth Reddy Clear Instructions : 2027 నాటికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేయాలి

















