Pawan Kalyan : విశాఖపట్నం – నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీని నడిపిస్తానని ప్రకటించారు జనసేన పార్టీ చీఫ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొణిదల. గురువారం విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కీలక సమావేశానికి పార్టీకి చెందిన మంత్రులు, కార్పొరేషన్స్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , పార్టీ బాధ్యులు హాజరయ్యారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. జనసేనను స్థాపించింది డబ్బులు సంపాదించడానికో లేదా పదవులు పొందడానికో కాదన్నారు పవన్ కళ్యాణ్. ఇది పూర్తిగా ప్రజల కోసం పుట్టిన పార్టీ అని స్పష్టం చేశారు. ఇది సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఉంటుందన్నారు. తనకు జనం అంటేనే ఇష్టమని, వారు లేకుండా తాను ఉండలేనని అన్నారు జనసేనాని.
Deputy CM Pawan Kalyan Key Comments
ఆనాడు జగన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ సర్కార్ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని వాపోయారు. అయినా జనం తన వెంట ఉన్నారని, తనను అరెస్ట్ చేయాలని చూస్తే ఓ మహిళ , తన బిడ్డతో విశాఖ బీచ్ లో ఆందోళన చేపట్టిందని, ఆమె చేసిన ఆ పని తనను ఎంతగానో ఆలోచించేలా చేసిందన్నారు పవన్ కల్యాణ్ కొణిదల. సోషల్ మీడియాలో మహిళలపై పోస్టులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. యువత కి ఉపాధి అవకాశాలు, మహిళల కి భద్రత పై నాదెండ్ల మనోహర్ ప్రతి పాదన చేశారు. సున్నా నుండి 100 శాతానికి పెరిగామన్నారు. పదవి అనేది ఒక బాధ్యత అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మొట్ట మొదటిగా మాట్లాడారని పేర్కొన్నారు.
Also Read : India Govt New Rules Sensational : ఆర్థిక లావాదేవీలపై భారత్ సర్కార్ విదించనున్న కొత్త నియమాలు ఇవే

















