Pawan Kalyan : అమరావతి : శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదలకు (Pawan Kalyan) ఆహ్వానం అందజేశారు మేనేజింగ్ ట్రస్టీ చైర్మన్ రత్నాకర్ . ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయనతో పాటు తాను కూడా పాల్గొంటానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కొణిదల. ఇదిలా ఉండగా పుట్టపర్తిలో రోడ్ల నిర్మాణానికి అదనంగా రూ. 30 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ బోర్డు సభ్యులు.
DY CM Pawan Kalyan Gets Invitation
ఇందులో భాగంగా శత జయంతి ఉత్సవాల వివరాలు తెలియజేశారు డిప్యూట సీఎంకు. నవంబర్ 19వ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శత జయంతి ఉత్సవాలకు హాజరు కానున్న నేపథ్యంలో తాను కూడా పీఎంతో కలిసి వస్తానని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్టు చెప్పారు. శ్రీ సత్యసాయి మందిరానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదల. శత జయంతి ఉత్సవాల లోపు మందిరానికి అనుసంధానంగా రహదారులను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సత్యసాయి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ రత్నాకర్ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : CM Revanth Reddy Important Update : నీటి పారుదల ప్రాజెక్టులపై నివేదికలు సిద్దం చేయాలి
















