Pawan Kalyan : అమరావతి : మొంథా తుపాను అల్లకల్లోలం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఈ తుపాను ఎఫెక్టు ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలను ఇబ్బంది పెట్టింది. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభించింది. రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు నీటి పాలయ్యాయి. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేపట్టగా గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల (Pawan Kalyan) స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు దగ్గర తుపాను మూలంగా దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ధైర్యం చెప్పారు.
DY CM Pawan Kalyan Visit
దివిసీమ సమస్యల గురించి, వాటి శాశ్వత పరిష్కారాల గురించి స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొంథా తుపానును సమర్థవంతంగా ఎన్నుకున్నామని అన్నారు ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరం చేశామన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ఇప్పటి వరకు భారీ ఎత్తున రైతులు పంటలను కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వం తప్పకుండా బాధితులను , రైతులను ఆదుకుంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్.
Also Read : NHRC Fired on Nursing Colleges : నర్సింగ్ కళాశాలల అక్రమాలపై చర్యలేవి..?

















