అజిత్ ప‌వార్ దుర్మ‌ర‌ణం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంతాపం

అరుదైన నాయ‌కుడిని, ఆత్మీయుడిని కోల్పోయాను

helloteluguu-PawanKalyan

అమ‌రావ‌తి : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సిపి అధ్యక్షులు, ఎన్‌డిఎ కూటమి నాయకులైన అజిత్ దాదా పవార్ ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారనే విషాద వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు ఏపి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల‌. ఆయన చేసిన అంకితభావంతో కూడిన ప్రజా సేవ, మహారాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఆయన అందించిన అపారమైన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండి పోతాయని అన్నారు. ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను నిరంతరం గౌరవంతో స్మరించుకుంటార‌ని తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఆయన మరణం పట్ల నేను ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని, ఈ తీవ్ర దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు డిప్యూటీ సీఎం. ఇటీవ‌లే తాను మ‌హారాష్ట్రలో ప‌ర్య‌టించాన‌ని గుర్తు చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా తాను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, మ‌రాఠా సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ , ఉప ముఖ్య‌మంత్రి ఏక్ నాథ్ షిండే తో పాటు అజిత్ ప‌వార్ కూడా పాల్గొన్నార‌ని తెలిపారు . ఎన్నో విష‌యాల‌పై ఇరువురం చ‌ర్చించుకున్నామ‌ని , ప‌వార్ ను మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు.

Exit mobile version