గురుద్వారా స‌న్నిధిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్

సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ తో క‌లిసి

hellotelugu-PawanKalyan

మ‌హారాష్ట్ర : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌హారాష్ట్ర‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. స్వ‌యంగా సీఎం ఫ‌డ్న‌వీస్ ఆహ్వానించారు. నాందేడ్ లోని గురుద్వారాను సంద‌ర్శించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అక్క‌డ శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. అంత‌కు ముందు ప‌విత్ర మైన చాద‌ర్ ను స‌మ‌ర్పించారు. సిక్కుల 10వ మత గురువుగా గురు గోవింద్ సింగ్ పేరు పొందారు. ఆయ‌న‌కు పెద్ద ఎత్తున భ‌క్తులు ఉన్నారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటి అయిన గురు ద్వారా హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు.

శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్యాహ్న సమయంలో సచ్ ఖండ్ గురు ద్వారాను సందర్శించారు. ఆయనకు గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. గురు ద్వారా ప్రముఖుల చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ కు సంప్రదాయ సిక్కు తలపాగాను ధరించారు. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తో కలసి ఉప ముఖ్యమంత్రి గురుద్వారాలో ప్రవేశించారు. ప్రధాన మందిరంలో శ్రీ గురుగోవింద్ సింగ్ సాయిబాకు ప్రార్ధనలు చేశారు. చాదర్ ను సమర్పించి నమస్కరించారు. అనంతరం గురుద్వారా గ్రంథీలు పవిత్ర వస్త్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, ఫడ్నవిస్ కి వేసి ఆశీర్వదించారు. అనంతరం సమాధి మందిరం లోపల భాగంలో ప్రదక్షిణ ముగించుకుని వెలుపలికి వచ్చారు.

Exit mobile version