Pawan Kalyan : విశాఖపట్నం – సోషల్ మీడియాలో మహిళలపై జుగుప్సాకరంగా జరుగుతున్న దాడిని అడ్డుకునేలా జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ వేదికగా మాట్లాడాల’ని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. దీనిపై అంతా సమష్టిగా అసెంబ్లీలో చర్చించి ఓ ప్రత్యేకమైన చట్టం లేదా ఆర్డినెన్స్ తీసుకువచ్చేలా పని చేద్దామని చెప్పారు. దీనిపై నిపుణులతో ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి సూచనలు తీసుకుందామన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా విశాఖ వేదికగా జరిగిన పార్టీ లెజిస్లేటివ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan Key Comments
జనసేన విజయానికి 2024 ఎన్నికలు ఆరంభం మాత్రమే అని, ఈ గెలుపు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిరాటంకంగా కొనసాగుతుందని ప్రకటించారు పవన్ కళ్యాణ్. సైద్ధాంతిక బలాన్ని నేను నమ్ముతాను. అటువంటి సిద్ధాంతాల ఆధారంగా ఆవిర్భవించిన జనసేనకు ప్రజలు భావజాలంతో కనెక్ట్ అయ్యారు. దీనికి జనసేనలో అపారంగా ఉన్న యువశక్తే కారణమని వెల్లడించారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో యువతదే కీలక పాత్ర అని, వారికి అండగా, ఆలంబనగా నాయకులంతా నిలబడాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భవించి ఒక దశాబ్దం పూర్తయ్యింది. ఈ దశాబ్దకాలంలో లక్షలాది మందితోనూ, ఈ సీజన్ లో 10 వేల మందితో ముఖాముఖిగా మాట్లాడి ఉంటాను. ప్రజలకు, పార్టీకి మధ్య సైద్ధాంతిక వారధి ఉన్న కారణంగా భవిష్యత్తంతా జనసేనదేనని ఆయన స్పష్టం చేశారు.
Also Read : CM Chandrababu Alarming : ఫాస్ట్ ట్రాక్ లో పారిశ్రామిక ప్రాజెక్టులు పూర్తవ్వాలి
















