Paul Kapur : అమెరికా : ప్రపంచ భారతీయ-అమెరికన్ పాల్ కపూర్ (Paul Kapur) దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా సహాయ కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన స్వస్థలం న్యూఢిల్లీ. అమెరికా ప్రాంతీయ దౌత్యానికి నాయకత్వం వహించనున్నారు, డొనాల్డ్ లూ స్థానంలో భారతీయ-అమెరికన్ రచయిత, భద్రతా నిపుణుడు పాల్ కపూర్ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరోకు కొత్త యుఎస్ సహాయ కార్యదర్శిగా కొలువు తీరారు. భారతదేశం, పొరుగు దేశాలతో సత్ సంబంధాలు నెలకొల్పేందుకు తను ప్రయత్నం చేస్తారని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అసిస్టెంట్ సెక్రటరీగా కపూర్ భారతదేశం, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, కిర్గిజ్స్తాన్, కజకిస్తాన్, మాల్దీవులు, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ , ఉజ్బెకిస్తాన్లలో అమెరికా దౌత్యపరంగా మరింత ఫలితాలు సాధించేందుకు గాను తనను నియమించినట్లు పేర్కొంది సర్కార్.
Paul Kapur Takes Charge as a US Assistant Secretary
ఇదిలా ఉండగా 2021 నుండి ఈ పదవిలో పనిచేసిన డోనాల్డ్ లూ స్థానంలో పాల్ కపూర్ నియమితులయ్యారు. కపూర్ న్యూఢిల్లీలో భారతీయ తండ్రి, అమెరికన్ తల్లికి జన్మించారు. ఆయన అమెరికా నావల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్‌లో జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వ విద్యాలయంలోని హూవర్ ఇన్‌స్టిట్యూషన్‌లో విజిటింగ్ ఫెలోగా ఉన్నారు. 2020-2021 వరకు కపూర్ స్టేట్ డిపార్ట్‌మెంట్ పాలసీ ప్లానింగ్ స్టాఫ్‌లో పనిచేశారు. దక్షిణ మధ్య ఆసియా, ఇండో-పసిఫిక్ వ్యూహం, అమెరికా-భారతదేశ సంబంధాలకు సంబంధించిన అంశాలపై పనిచేశారు కపూర్. అంతర్జాతీయ భద్రతా వాతావరణం, అణ్వాయుధాల విస్తరణ, నిరోధం , ఇస్లామిస్ట్ మిలిటెన్సీపై అనేక పుస్తకాలను రచించారు.
Also Read : Rohit Sharma New Record Interesting : వన్డే ఫార్మాట్ లో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్


















