Mohanlal : హైదరాబాద్ : మహేష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న పేట్రియాట్ షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చేరగా ఆయనతో కొత్తగా జత కట్టారు జాతీయ అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్ లాల్ (Mohanlal) జాయిన్ అయ్యారు. తన అనుభవం ఈ సినిమాకు అదనపు అర్హతగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆరు నెలల విరామం తర్వాత, మలయాళ సినిమా దిగ్గజ నటుడు మమ్ముట్టి తిరిగి కెమెరా ముందుకు వచ్చారు. దర్శకుడు మహేష్ నారాయణన్ ఈ చిత్రాన్ని మల్టీ స్టారర్ గా దీనిని చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్ లో భాగంగా మోహన్ లాల్ హైదరాబాద్ కు చేరుకున్నారు.
Mohanlal Movie Updates
చాలా గ్యాప్ తర్వాత షూటింగ్ లో కొనసాగుతుండడం విశేషం. మిగిలిన షెడ్యూల్‌ల కోసం కీలక కాంబినేషన్ సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్. ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద మలయాళ చిత్రంగా చెప్పబడుతున్న దీని టీజర్ విడుదలైంది. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే అంతా మహేష్ నారాయణన్ చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇప్పటికే శ్రీలంక, అజర్ బైజాన్, ఢిల్లీ, షార్జా, కొచ్చి , లడఖ్‌లలో షెడ్యూల్‌లను పూర్తి చేసింది.
మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార, జెరీన్ షిహాబ్, రేవతి పేట్రియాట్ మూవీలో కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, కిచప్పు ఫిల్మ్స్ బ్యానర్‌పై అనిల్‌కుమార్ నిర్మిస్తున్నారు. సి.ఆర్. సలీం ప్రొడక్షన్స్ , బ్లూ టైగర్స్ లండన్ ద్వారా సి.ఆర్. సలీం , సుభాష్ జార్జ్ మాన్యుయేల్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు, రాజేష్ కృష్ణ , సి.వి. సారథి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Also Read : Devaragutta Incident Shocking : దేవరగట్టు ఉత్సవం తీవ్ర విషాదం
