బీహార్ : బీహార్ కు చెందిన మంత్రి నితిన్ నబిన్ ను భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించడంపై తీవ్రంగా స్పందించారు పూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదే తమ రాష్ట్రానికి చెందిన రాజేంద్ర బాబు అధ్యక్షుడయ్యారు, సీతారాం కేసరి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, లలిత్ బాబు, జగజీవన్ రామ్, భోలా పాశ్వాన్ శాస్త్రి వంటి వారు కూడా ఉన్నారని గుర్తించాలన్నారు. ఈ బీహార్ దేశానికి ఎంతో మందిని ఇచ్చిందన్నారు. దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారు ఎందరో నేతలు ఉన్నారని చెప్పారు పప్పూ యాదవ్.
అయితే నితిన్ నబిన్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ పరంగా చూసినా, ఏ రకంగా చూసినా ఆయన అందరికీ కావాల్సిన వాడు. ఒక రకంగా చెప్పాలంటే మంచి వ్యక్తి, మర్యాదస్తుడు, వివాదాస్పదుడు కాదు. ఇక నుంచైనా దూషణల సంస్కృతి అంతమవుతుందని తాము తన నుంచి , పార్టీ నుంచి ఆశిస్తున్నట్లు చెప్పారు పప్పూ యాదవ్. ప్రతి ఒక్కరూ సిద్ధాంతాల కోసమే పోరాడుతారు… ఆయన బలిపశువు కావచ్చు అని ముందస్తుగా హెచ్చరించారు. ఏ పోరాటంలో, కారణం ఏమిటో ఎవరికీ తెలియదు? నిన్న చౌదరిని యూపీ అధ్యక్షుడిగా చేశారు, ఆయన యోగి అనుచరుడు కానే కాదు, రాజ్‌నాథ్ సింగ్ అనుచరుడని బాంబు పేల్చాడు పప్పూ యాదవ్. సంఘ్ లేకుండా బీజేపీ పని చేయలేదంటూ ఎద్దేవా చేశారు. ఇక అమిత్ షా అంటారా కాలమే తన గురించి చెబుతుందన్నాడు.

















