హైదరాబాద్ : విజయ్ హజారే ట్రోఫీలో పలువురు ఆటగాళ్లు దుమ్ము రేపుతున్నారు. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. దీంతో ఇప్పటికే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే తుది జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఇందులో వైస్ కెప్టెన్ గా ఉన్న శుభ్ మన్ గిల్ ను సైతం పక్కన పెట్టింది. మరో వైపు కెప్టెన్ గా ఉన్న సూర్య కుమార్ యాదవ్ కు ఇదే ఆఖరి ఛాన్స్ అని పేర్కొన్నట్లు సమాచారం. గత కొంత కాలంగా తను ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. మీడియాతో మాట్లాడిన సెలెక్షన్ కమటీ తెల్ల ఏనుగులను ఎక్కువ కాలం మోయలేమంటూ పేర్కొనడం ఒకింత ఆడని వాళ్లకు హెచ్చరికలు పంపించారు. ఈ తరుణంలో ప్రస్తుతం న్యూజిలాండ్ తో వన్డే సీరీస్ ఆడాల్సి ఉంది భారత జట్టు.
పెద్ద ఎత్తున పలువురి క్రికెటర్ల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు వన్డే జట్టులో కొనసాగిన రిషబ్ పంత్ ను పక్కన పెడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో తనను కాకుండా టాప్ గేర్ లో ఉన్న కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ తో పాటు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్న ఇషాన్ కిషన్ , ధ్రువ్ జురేల్, జితేష్ శర్మలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం హెడ్ కోచ్ గంభీర్ ఒంటెద్దు పోకడ, అజిత్ అగార్కర్ కొందరికే ప్రయారిటీ ఇవ్వడం పలు విమర్శలకు దారితీసేలా చేసింది. దీంతో ఈసారి వన్డే జట్టు కూడా విస్తు పోయేలా ఉంటుందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.



















