‘పామాయిల్’ కు ఏపీలోనే అత్య‌ధిక ధ‌ర : అచ్చెన్నాయుడు

ఏపీ స‌ర్కార్ కు పామాయిల్ రైతుల ప్రత్యేక కృతజ్ఞతలు

hellotelugu-MinisterAtchannaidu

అమరావతి : పామాయిల్ పంట సాగు చరిత్రలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే అధిక ధర లభించడం రాష్ట్ర రైతుల్లో ఆనందోత్సాహాలను నింపింది. ఈ చారిత్రాత్మక పరిణామానికి కారణమైన కూట‌మి ప్రభుత్వ నిర్ణయాల పట్ల పామాయిల్ రైతులు, పామాయిల్ అసోసియేషన్ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని విజ‌య‌వాడ‌లోని క్యాంప్ కార్యాల‌యంలో కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇతర సంప్రదాయ పంటల నుంచి పామాయిల్ సాగు వైపు రైతులు పెద్ద సంఖ్యలో మొగ్గు చూపుతున్నారని, కూట‌మి ప్రభుత్వ విధానాల వల్ల తొలిసారి పామాయిల్ రైతులు నిజమైన సంతృప్తిని పొందుతున్నారని రైతులు ఈ సందర్భంగా తెలిపారు.

ముఖ్యంగా సరైన సమయంలో ఉన్నతమైన గిట్టుబాటు ధరను ప్రకటించడం వల్ల రైతులకు ఆర్థిక భరోసా కలిగిందని అన్నారు. పామాయిల్ సాగు విస్తరణ వల్ల రాష్ట్రంలో క్రాప్ డైవర్సిఫికేషన్ విజయవంతంగా అమలవుతోందని రైతులు పేర్కొన్నారు. ఒకే పంటపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా పామాయిల్ సాగు రైతులకు భరోసాగా మారిందన్నారు. అలాగే సాగు వ్యయాన్ని తగ్గించేలా డ్రిప్ పరికరాలపై సబ్సిడీని సరైన సమయంలో అందించడం ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలక నిర్ణయమని ప్రశంసించారు. పంట దిగుబడి వచ్చిన వెంటనే సరైన సమయంలో గిట్టుబాటు ధరను కల్పించడం వల్ల మార్కెట్ ఒడిదుడుకులకు భయపడాల్సిన అవసరం లేకుండా రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

Exit mobile version