శ్రీలంక : పాకిస్తాన్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఈసారైనా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకోవాలని, కప్ చేజిక్కించు కోవాలని కన్న కలలు అడియాశలు అయ్యాయి. శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్ లో కేవలం 5 పరుగుల తేడాతో గెలుపొందడంతో మెరుగైన రన్ రేట్ లేక పోవడం కారణంగా పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాండీ వేదికగా జరిగిన మ్యాచ్ లో 8 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ 212 రన్స్ చేసింది. సెమీస్ కు అర్హత సాధించాలంటే తప్పకుండా శ్రీలంకను 147 లేదా అంతకంటే తక్కువ స్కోర్ కు పరిమితం చేయాల్సి ఉండేది. ఇదిలా ఉండగా 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక చివరి వరకు విజయం కోసం పోరాడింది. 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. పాకిస్తాన్ నాకౌట్స్ లో 60 పరుగుల తేడాతో స్థానం కోల్పోయింది.
దీంతో సూపర్ 8 లో గ్రూప్ -2 నుండి సెమీస్ లో టేబుల్ టాపర్స్ లో ఇంగ్లండ్ తో పాటు న్యూజిలాండ్ చేరింది. ఇక శ్రీలంక, పాకిస్తాన్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు రసవత్తరంగా సాగింది. 12వ ఓవర్ లో పాకిస్తాన్ శ్రీలంకను 101 పరుగులకు 5 వికెట్లను కూల్చింది. భారీ తేడాతో గెలుస్తుందని అంతా భావించారు. కానీ 16వ ఓవర్ లో పవన్ రత్నాయకే, కెప్టెన్ దాసున్ షనక శ్రీలంకను 148 రన్స్ దాకా చేర్చారు. గెలుస్తామా లేదా అన్న మీమాంశలో పడి పోయింది పాకిస్తాన్. చివరకు మ్యాచ్ చేజారుతుందనే లోపు శ్రీలంక కేవలం 5 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడం ఆ దేశ క్రికెట్ ప్రేమికులకు రుచించలేదు.
