Owaisi : హైదరాబాద్ : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Owaisi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదం పట్ల కన్నీటి పర్యంతం అయ్యారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తున్న నలభై రెండు మంది హజ్ యాత్రికులు మంటల్లో చిక్కుకున్న బస్సులో ఉన్నారని తనకు సమాచారం అందిందన్నారు. ఇందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మరికొందరు గాయపడినట్లు తెలిసిందని, వెంటనే వారికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సౌదీ లోని రియాద్ భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ (DCM) అబూ మాథెన్ జార్జ్‌తో మాట్లాడానని చెప్పారు.
Owaisi Inquiry
ఈ విషయం గురించి వారు సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆయన తనకు హామీ ఇచ్చారని తెలిపారు ఎంపీ. తాను హైదరాబాద్‌కు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించి, ప్రయాణీకుల వివరాలను రియాద్ రాయబార కార్యాలయం, విదేశాంగ కార్యదర్శితో పంచుకున్నట్లు వెల్లడించారు. మృతదేహాలను తిరిగి భారతదేశానికి తీసుకు రావాలని, ఎవరైనా గాయపడితే, వారికి సరైన వైద్య చికిత్స అందేలా చూసుకోవాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ ను కోరానని చెప్పారు అసదుద్దీన్ ఓవైసీ. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్.
Also Read : Minister Azharuddin Important Update : సౌదీలో బస్సు ప్రమాదంపై అజారుద్దీన్ విచారం


















