మాది తండ్రీ కూతుళ్ల అనుబంధం : కీర్తి సురేష్

ఘాటుగా స్పందించిన మ‌హా న‌టి ఫేమ్

hellotelugu-KeerthySuresh

హైద‌రాబాద్ : ఈ మ‌ధ్య ఎందుక‌నో హీరోయిన్లు తీవ్ర ట్రోలింగ్ కు గుర‌వుతున్నారు. తాజాగా అందులో చేరి పోయింది మ‌హాన‌టి ఫేమ్ కీర్తి సురేష్. ఈ దక్షిణాది స్టార్ హీరోయిన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఆమె ప్రముఖ దర్శకుడు-నటుడు మిష్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యవాన్ సావిత్రి’ శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో, మిష్కిన్ తన చేతిని కీర్తి సురేష్ కాలుపై ఉంచిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కొందరు ఆయనను తీవ్రంగా విమర్శించారు. ఈ వివాదం ముదరడంతో కీర్తి సురేష్ తన హావ భావాలను తప్పుగా అర్థం చేసుకుని వ్యాఖ్యానించిన ఒక నెటిజన్‌కు గట్టి సమాధానం ఇచ్చారు.

తన ముఖంలో అసౌకర్యం ఎక్కడ కనిపించిందో చెప్పాలని ప్రశ్నించారు కీర్తి సురేష్. మేమిద్దరం వేదికపై ఏం చెప్పామో మీరు వినలేదా? మా మధ్య తండ్రీకూతుళ్ల వంటి పవిత్రమైన అనుబంధం ఉందని చెప్పాం కదా అని క‌డిగి పారేశారు. అంతే కాకుండా సినిమాల్లో నటీనటులు ఒకరినొకరు తాకడం సహజమేనని, అలాంటప్పుడు బహిరంగ వేదికలపై కూడా అదే విధంగా ప్రవర్తించడంలో తప్పేముందని నిల‌దీశారు కీర్తి సురేష్. సదరు వ్యక్తి ఆలోచనా దృక్పథాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. కీర్తి సురేష్ ఇచ్చిన ఈ ధైర్యవంతమైన సమాధానానికి నెటిజన్లు, అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే కీర్తి సురేష్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో కలిసి జ‌న‌వ‌రి 12 విడుద‌ల మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. దీనికి స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడైన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Exit mobile version