Kandula Durgesh : అమరావతి : ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా లోని ఓర్వకల్లును పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. ఓర్వకల్లులో రాక్ గార్డెన్ ను ఆకస్మికంగా సందర్శించారు. అనంతపురం నుండి కర్నూలు చేరుకున్న మంత్రి దుర్గేష్ (Kandula Durgesh) అనంతరం అక్కడి నుండి విజయవాడ వచ్చే ఫ్లైట్ కోసం సమయం ఉండటంతో రాక్ గార్డెన్ ను పరిశీలించారు మంత్రి. ఓర్వకల్లులో సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రఖ్యాత రాక్ గార్డెన్ అద్భుత ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తోందని వెల్లడించారు.
Kandula Durgesh Key Comments on Orvakallu Development
సహస సిద్ధమైన కొండల మధ్య ఉన్న రాతివనం, చెరువు, లక్షల ఏళ్ల క్రితం ఏర్పడ్డ వివిధ ఆకృతులతో కూడిన రాళ్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని చెప్పారు కందుల దుర్గేష్. ఓర్వకల్లులో హరిత రిసార్ట్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. స్థానికంగా బాహుబలి, డాకు మహారాజ్ తదితర సినిమా షూటింగ్ లు జరిగాయని చెప్పారు. రాబోయే రోజుల్లో రాక్ గార్డెన్ లో మరిన్ని షూటింగ్ లు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీలో ప్రధానంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో రాక్ గార్డెన్ ఒకటని వెల్లడించారు కందుల దుర్గేష్. ప్రపంచ పర్యాటకులు ఓర్వకల్లు రాక్ గార్డెన్ సందర్శించేలా మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. శ్రీశైలం, అహోబిలం, బెలూం గుహలు, యాగంటి తదితర ప్రదేశాలకు కలుపుతూ టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
సహజ సిద్ధ నిర్మాణాలు, కట్టడాలు రాష్ట్ర గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయని తెలిపారు. ఓర్వకల్ ఎయిర్ పోర్టుతో స్థానిక పర్యాటక ప్రదేశాలకు అనుసంధానం పెరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో, కేంద్ర సహకారంతో ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కానుందని అన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు కందుల దుర్గేష్.
Also Read : High Court Shocking Telangana Govt : సర్కార్ నిర్వాకం హైకోర్టు ఆగ్రహం
















