Whatsapp : ఇకపై ఆధార్ కార్డు కావాలంటే యూఐడీఏఐ వెబ్సైట్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారానే ఆధార్ కార్డు పీడీఎఫ్ రూపంలో పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేకమైన మైగవ్ (MyGov) హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్‌ను వాట్సాప్‌లోకి (Whatsapp) ఇంటిగ్రేట్ చేశారు.
Whatsapp – ఈ సర్వీస్‌ను ఎలా వాడాలి?
- ముందుగా మీ మొబైల్ నెంబర్‌కు ఆధార్‌ను లింక్ చేయాలి.
- ఒక డిజిలాకర్ అకౌంట్ ఉండాలి.
- తర్వాత రిజిస్టర్డ్ మొబైల్లో +91-9013151515 (MyGov Helpdesk) నంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
- వాట్సాప్ ఓపెన్ చేసి, ఆ నంబర్‌కి “హాయ్” అని మెసేజ్ పంపాలి.
- చాట్‌బాట్ నుంచి వచ్చే ఆప్షన్లలో డిజిలాకర్ సేవలు ఎంచుకోవాలి.
- మీ డిజిలాకర్ అకౌంట్ వెరిఫై చేసి, 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి.
- ఇప్పుడు మీ డిజిలాకర్‌లో ఉన్న డాక్యుమెంట్ల జాబితా కనిపిస్తుంది.
- అందులో ఆధార్‌ను ఎంచుకుంటే, పీడీఎఫ్ రూపంలో వాట్సాప్‌కి వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన విషయాలు
- ఒకేసారి ఒక డాక్యుమెంట్ మాత్రమే పొందే వీలుంటుంది.
- డిజిలాకర్‌లో ముందే ఆధార్ లింక్ చేసి ఉండాలి. లేకపోతే వాట్సాప్‌లో కనిపించదు.
- ఒకసారి లింక్ చేసి ఉంటే భవిష్యత్తులో ఎప్పుడైనా వాట్సాప్ ద్వారా ఆధార్ లేదా ఇతర డిజిలాకర్ డాక్యుమెంట్స్ సులభంగా పొందవచ్చు.
ఈ కొత్త సదుపాయం వల్ల, ఇకపై ఎప్పుడు కావాలన్నా వాట్సాప్ ద్వారానే ఆధార్ కార్డు పొందవచ్చు.
Also Read : EPFO Warning : తప్పుడు కారణాలతో డబ్బు వాడుకుంటే శిక్ష తప్పదంటున్న పీఎఫ్ సంస్థ
