ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లుపై ప్ర‌తిపక్షాల ఆందోళ‌న

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఎంపీల నిర‌స‌న , ఆగ్ర‌హం

helloteugu-MPsProtest

 

న్యూఢిల్లీ : కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న బాట ప‌ట్టారు ఎంపీలు. బుధ‌వారం పార్ల‌మెంట్ లో ఎఫ్‌సిఆర్‌ఎ సవరణ బిల్లును ప్ర‌వేశ పెట్టింది మోదీ ప్ర‌భుత్వం. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఎంపీలు. కాంగ్రెస్ ఎంపీ హిబి ఈడెన్ ప్రతిపాదిత చట్టాన్ని క్రూరమైన చట్టంగా అభివర్ణించారు, ఇది దేశవ్యాప్తంగా మైనారిటీలు, ఎన్‌జిఓలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. విదేశీ విరాళాల సవరణ బిల్లు, 2026ను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు మకర్ ద్వార్ వద్ద నిరసన తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా మైనారిటీలు, ఎన్‌జిఓలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. ఏఎన్ఐతో మాట్లాడుతూ ఈడెన్ ఈ బిల్లు మైనారిటీల ప్రయోజనాలకే కాకుండా భారతదేశంలో పనిచేస్తున్న అనేక ఎన్‌జిఓల ప్రయోజనాలకు కూడా ఆటంకం కలిగిస్తుందని అన్నారు.

ఈ బిల్లును ప్రతిపక్షం తీవ్రంగా ఖండిస్తుందని , ఉప సంహరించు కోవాలని డిమాండ్ చేస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ ధర్మవీర్ గాంధీ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. ఇలాంటి నిర్ణయాలు నిష్పక్షపాతంగా ఉండాలని, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని, కానీ పక్షపాతంగా ఉండకూడదని పేర్కొన్నారు. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఎంపీ ఎన్.కె. ప్రేమ్‌చంద్రన్ మాట్లాడుతూ, ఈ సమస్య ఏ ఒక్క వర్గానికీ పరిమితం కాదని, మైనారిటీల హక్కులు, అధికారాలను అరికట్టే విస్తృత ఎజెండాను ఈ బిల్లు ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు, 2026, లోక్‌సభలో పరిశీలన , ఆమోదం కోసం జాబితా చేయబడింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిని చర్చకు ప్రవేశ పెట్టనున్నారు.

Exit mobile version