OG : హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన తాజా చిత్రం ఓజీపై (OG) పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు . గతంలో ఎన్నడూ లేనంతగా ఆయన పూర్తి విశ్వాసాన్ని ప్రకటించాడు. ఆరు నూరైనా సరే ఓజీ పక్కా విజయం సాధిస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు. అంతే కాదు ఈ సినిమాను రూపొందించిన దర్శకుడు సుజిత్ ను ఆకాశానికి ఎత్తేశాడు. తాను అనుకున్న దానికంటే అద్బుతంగా వచ్చిందని చెప్పాడు. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ మూవీ అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని పేర్కొన్నాడు. తాను గతంలో నటించిన మూవీస్ కంటే ఇందులో తనది భిన్నమైన పాత్ర అని చెప్పాడు. ఈ సినిమా విశేషాలు కూడా తెలిపాడు. ఓజీ కోసం తాను ప్రత్యేకంగా జపనీస్ భాషను నేర్చుకున్నానని అన్నాడు పవన్ కళ్యాణ్ కొణిదల. ఓ వైపు కుండపోత వర్షం ఉన్నా అభిమానులు చెక్కు చెదరకుండా ఉన్నారని, వీరిని చూస్తే ఇక ఓజీ ఆగదని తేలి పోయిందన్నాడు.
OG Movie Updates
ఈ సందర్భంగా కొన్ని డైలాగులను వినిపించాడు హీరో. నువ్వు ఆకాశంలో చేరుకోలేవు, కానీ నేను నిన్ను భూమికి దించుతాను. ఓజీతో మరణం వచ్చినప్పుడు అది ఎంత భయంకరంగా ఉంటుందో ఈ పాట తెలియజేస్తుందని అన్నాడు. ఇక బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మితో కలిసి పని చేసినందుకు ఆనందంగా ఉందన్నాడు పవర్ స్టార్. పవన్ స్వయంగా వాషి యో వాషి పాట పాడిన తర్వాత చాలా కాలంగా ఎదురు చూస్తున్న ట్రైలర్‌ను ఆవిష్కరించారు. దర్శకుడు సుజీత్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అతను హార్డ్‌కోర్ అభిమాని. సినిమా పట్ల అతనికి మక్కువ . అదే తనను కలిసేలా, ఓజీ తీసేలా చేసిందన్నాడు. సుజీత్ సరళంగా కథ చెబుతాడు, కానీ అతను దర్శకత్వం వహించినప్పుడు ప్రతిభ ప్రకాశిస్తుందని ప్రశంసించాడు.
Also Read : Mirai Sensational Collections : అమెరికాలో మిరాయ్ కలెక్షన్స్ అదుర్స్


















