మ‌హంకాళి అమ్మ వారికి ‘మారు బోనం’ స‌మ‌ర్ప‌ణ

ప్ర‌త్యేక పూజ‌లు చేసిన మంత్రి కొండా సురేఖ

hellotelugu-Surekha

సికింద్రాబాద్ : ఆషాఢ బోనాల ఉత్సవాల్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ, వక్ఫ్ శాఖల మంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మ వారికి ‘మారు బోనం’ సమర్పించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ రెడ్డి , అర్చకులు మంత్రికి డప్పు వాయిద్యాలు, తాళాలు, శివసత్తుల విన్యాసాలతో ఘన స్వాగతం పలికారు. కొండా సురేఖ అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మారు బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తలపైన బోనం మోసుకొచ్చిన మహిళలకు మంత్రి సురేఖ చీరలను బహూకరించారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మారు బోనం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. బియ్యంతో తయారు చేసిన మారు బోనాన్ని అమ్మవారికి సమర్పించడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో ఒక విశిష్టమైన ఆచారమని ఆమె పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ,సిరి సంపదలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల పండుగను భక్తిభావంతో, గౌరవంతో జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని ఆమె అన్నారు. ఈ ఏడాది ప్రజలు ఆషాఢ బోనాల ఉత్సవాలను ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో జరుపుకుంటున్నారని చెప్పారు.

Exit mobile version