Novotel : హైదరాబాద్ – నోవోటెల్ హైదరాబాద్ విమానాశ్రయం ఫుడ్, బెవరేజ్ ఫుడ్ అండ్ రెసిపీస్ డైరెక్టర్‌గా జ్ఞాన్‌దీప్ సింగ్‌ను నియమించింది. ప్రముఖ లగ్జరీ హోటల్ బ్రాండ్‌లలో 18 సంవత్సరాలకు పైగా విభిన్న అనుభవంతో సింగ్ ఫుడ్, బెవరేజ్ విభాగానికి నాయకత్వం వహిస్తారు. తన కొత్త పాత్రలో సింగ్ రెస్టారెంట్లు, బార్‌లు, విందులు, ఈవెంట్‌లతో సహా నోవోటెల్ (Novotel) హైదరాబాద్ విమానాశ్రయంలో ఆహారం, పానీయాల కార్యకలాపాల మొత్తం స్పెక్ట్రమ్‌ను పర్యవేక్షిస్తారు. వ్యూహాత్మక దృష్టి, వ్యాపార అభివృద్ధిలో నిరూపితమైన ట్రాక్ రికార్డ్ కార్యాచరణ నైపుణ్యం హోటల్‌ను వ్యాపార పరంగా మరింత విస్తరించేందుకు దోహద పడుతుందని నోవాటెల్ భావిస్తోంది.
Novotel Food and Beverage New Director
జ్ఞాన దీప్ సింగ్ హైదరాబాద్, బెంగళూరు, గోవా, చెన్నై, ముంబైలలో నాయకత్వ పాత్రల్లో రాణించారు. అంతే కాదు దేశంలోనే పేరు పొందిన టాటా గ్రూప్ కు చెందిన తాజ్ హోటల్స్ , హిల్టన్, హయత్, ది లీలా, ఐటీసీ హోటల్స్ , మారియట్ వంటి పేరు పొందిన బ్రాండ్ లతో పనిచేశారు. తన అపారమైన అనుభవంతో ఫుడ్, బేవరేజ్ ఫోర్ట్ ఫోలియోలను సమర్థవంతంగా నిర్వహించారు. తన కారణంగా ఆయా సంస్థలకు గణనీయమైన ఆదాయాలను సమకూర్చి పెట్టాయి. దీంతో ఇప్పుడు సింగ్ సంచలనంగా మారారు. తన రాకతో నోవాటెల్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
వ్యూహాత్మక మార్కెటింగ్ చొరవలు, లగ్జరీ క్లయింట్ సర్వీసింగ్, పానీయాల ధరల ఆవిష్కరణలు తన కెరీర్ మార్గంలో కార్యాచరణ సామర్థ్య మెరుగుదలలలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.
Also Read : Elon Musk – Zuckerberg Important Deal : జుకర్ బర్గ్ తో ఎలాన్ మస్క్ డీల్



















