హైదరాబాద్ : గతంలో బీఆర్ఎస్ పాలనా కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది టీ హబ్ హైదరాబాద్ కేంద్రంగా. టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగుతోంది. ఎంతో మంది ఔత్సాహికులకు, ఆంట్రప్రెన్యూయర్లకు ఇది సహకారం అందిస్తోంది. ఈ తరుణంలో రాష్ట్రం సర్కార్ మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ సందర్భంగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పలువురిని మార్చారు సీఎం. ఇదే సమయంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి పదవులను కట్టబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ప్రభుత్వ కార్యాలయాలను టీ హబ్ లోకి మారుస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.
శనివారం కీలక ప్రకటన చేశారు. టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్ కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్ చేసి మాట్లాడారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ హబ్ ను ప్రత్యేక స్టార్టప్ ల కేంద్రంగానే గుర్తించాలని స్పష్టం చేశారు.
ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా స్టార్టప్లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్ లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచనలుంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు
