కష్టంలో ఉన్నప్పుడు ఎవ్వరూ రాలేదు : అర్జున్

‘జెంటిల్‌మెన్’ కోసం శ‌ర‌త్ కుమార్ ను అనుకున్నారు

hellotelugu-ArjunnSarja

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టుడు అర్జున్ స‌ర్జా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికి ఎవ‌రూ కార‌ని అన్నారు. ఎవ‌రికి వారే త‌మ లోకంలో ఉంటార‌ని పేర్కొన్నాడు. త‌న అనుభ‌వాల‌ను మొద‌టిసారిగా పంచుకున్నారు. ‘జెంటిల్‌మెన్’కు ముందు శరత్‌కుమార్‌ని అనుకున్నారని, ఫోటోషూట్ కూడా అయిందని చెప్పాడు. ఆ త‌ర్వాత త‌న వ‌ద్ద‌కు వ‌చ్చార‌ని తెలిపాడు అర్జున్ స‌ర్జా. అప్పట్లో ఇండస్ట్రీ మీద నాకు చాలా కోపం ఉండేద‌న్నాడు. తాను క‌ష్ట కాలంలో ఉన్న స‌మ‌యంలో ఎవ‌రూ త‌న వ‌ద్ద‌కు రాలేద‌ని వాపోయాడు. స‌క్సెస్ ఉన్న‌ప్పుడే వ‌స్తార‌ని, మ‌నం ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో ఎవ‌రూ ద‌గ్గ‌ర‌కు రార‌ని ఇది జీవిత స‌త్య‌మ‌ని చెప్పాడు న‌టుడు.

అయితే జెంటిల్మెన్ విష‌యంలో న‌టించాల‌ని టెక్నిషియ‌న్ ప‌ట్టుప‌ట్టాడు. చివ‌ర‌కు క‌థ వినాల్సి వ‌చ్చంది. ఆ వెంట‌నే క‌థ న‌చ్చ‌డంతో ఓకే చెప్పాను. ఆ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అప్ప‌ట్లో తాను టాప్ హీరోగా కొన‌సాగాన‌ని, ఆత‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకుంటే ఎన్నో సినిమాలు చేసినా కొన్ని మూవీస్ మాత్ర‌మే గుర్తుండి పోతాయ‌ని చెప్పాడు అర్జున్ స‌ర్జా. ఏది ఏమైనా ఇవాళ సినిమా రంగంలోకి రావాల‌ని అనుకుంటున్న వాళ్లు త‌మ క‌ష్టాన్ని న‌మ్ము కోవాల‌ని సూచించాడు. ఎవ‌రూ ఎవ‌రికి సాయం చేయ‌ర‌ని , మీలో టాలెంట్ ఉంటే వారే మీ వ‌ద్ద‌కు వ‌స్తార‌న్నాడు అర్జున్ .

Exit mobile version