కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన కీలకమైన దాయాదుల పోరులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా మెగా టి20 వరల్డ్ కప్ టోర్నీని నిర్వహిస్తోంది. అయితే ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల కారణంగా భారత జట్టు మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్ జట్టు కెప్టెన్ తో కరచాలనం (షేక్ హ్యాండ్ ) చేసేందుకు ఒప్పుకోలేదు టీమిండియా స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్. ఇదిలా ఉండగా గతంలో లాగానే ఇరు జట్ల సారథులు సూర్య భాయ్, సల్మాన్ అలీ ఆగా పాత సాంప్రదాయాన్ని కొనసాగించారు.
మ్యాచ్ లో భాగంగా టాస్ వేసే సమయంలో ఇద్దరూ కనీసం మాట్లాడుకోలేదు. షేక్ ఇవ్వకుండానే మీడియాతో మాట్లాడుతూ వెళ్లిపోయారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా దాయాదుల పోరును వీక్షించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 175 రన్స్ చేసింది 7 వికెట్లు కోల్పోయి. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఏ కోశానా ధీటుగా జవాబు ఇవ్వలేక పోయింది. భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 114 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత జట్టు చేతిలో 61 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.


















