నితీశ్ రాణా షాన్ దార్ ఇన్నింగ్స్

ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు త‌ప్పని ఓట‌మి

helotelugu-NitishRana

న్యూఢిల్లీ : ఐపీఎల్ 2026లో రికార్డులు బ‌ద్ద‌లు అవుతున్నాయి. భారీ స్కోర్లు న‌మోద‌వుతున్నాయి. యంగ్ క్రికెట‌ర్ల‌తో పాటు అనుభ‌వం క‌లిగిన ఆట‌గాళ్లు దుమ్ము రేపుతున్నారు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రిస్తున్నారు. దీంతో భారీ స్కోర్ దిశ‌గా ఆయా జట్లు రికార్డు సృష్టిస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ భారీ టార్గెట్ ను ఛేదించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగింది ఢిల్లీ క్యాపిట‌ల్స్ . విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ ఆడారు కేఎల్ రాహుల్ , నితీశ్ రానా. ఈ ఇద్ద‌రూ క‌లిసి రికార్డు భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నారు. గ్రౌండ్ చుట్టూ ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డారు. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏకంగా 2 వికెట్లు కోల్పోయి 264 ర‌న్స్ చేసింది. ఆ త‌ర్వాత పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే ప‌ని పూర్తి కానిచ్చేసింది. వ‌రుస విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి చేరి పోయింది పంజాబ్.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే కేఎల్ రాహుల్ కేవ‌లం 67 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 152 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 16 ఫోర్లు 9 భారీ సిక్సులు ఉన్నాయి. త‌న సెంచ‌రీకి తోడు నితీశ్ రాణా కూడా అండ‌గా నిచాడు . షాన్ దార్ ఇన్నింగ్స్ తో అల‌రించాడు. త‌ను కేవ‌లం 44 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 91 ర‌న్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. పంజాబ్ కెప్టెన్ అయ్య‌ర్ బౌల‌ర్ల‌ను ఎంత‌మందిని ప్ర‌యోగించినా ఫ‌లితం లేకుండా పోయింది. ప‌రుగుల వ‌ర‌ద పారించారు ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు.

Exit mobile version