న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బీహార్ రాష్ట్రానికి చెందిన రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ నబిన్ న్యూఢిల్లిలోని పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు బాధ్యతలను అప్పగించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన జేపీ నడ్డా. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో పార్టీ అధ్యక్ష పదవి రేసులో పలువురు సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ చివరకు అనూహ్యంగా నితిన్ నబిన్ తెర పైకి వచ్చారు.
ఆర్ఎస్ఎస్ సూచనలతోనే తనకు ప్రయారిటీ ఇచ్చారని సమాచారం. ఇది పక్కన పెడితే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా పేరు పొందారు నితిన్ నబిన్. తన స్వస్థలం బీహార్. తన తండ్రి అరుదైన రాజకీయ నాయకుడు. ఆయన 2006లో చని పోయాక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు నితిన్ నబిన్. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా, ప్రజల మెప్పు పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. అంతే కాదు నితిన్ నబిన్ ఏకంగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజా నాయకుడిగా పేరు పొందిన తన నాయకత్వం జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్ పదవికి అర్హుడని అందుకే ఎంపిక చేయాల్సి వచ్చిందని చెప్పారు అమిత్ చంద్ర షా.
















