Income Tax Bill 2025 : ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు-2025ను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. ఇందులో పలు సవరణలు చేసి, సమగ్రంగా పునఃరూపకల్పన చేసిన కొత్త బిల్లును ఈ నెల 11న మళ్లీ పార్లమెంట్‌కు సమర్పించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది.
New Income Tax Bill 2025 Updates
1961లో రూపొందించిన ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని ఆధునీకరించేందుకు, సాధారణ పౌరులకు మరింత స్పష్టతనిచ్చేలా ప్రభుత్వం ఈ కొత్త బిల్లును రూపొందించింది. ఫిబ్రవరి 13న బైజయంత్ పాండా (Baijayanat Panda) నేతృత్వంలోని ఎంపీల కమిటీకి ఈ బిల్లు పరిశీలన కోసం అప్పగించగా, వారు పలు కీలక మార్పులను సూచించారు.
ఈ సూచనల మేరకు బిల్లును సవరించి, సులభమైన భాషలో, ప్రకటనలతో కూడిన రూపంలో తిరిగి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మార్పులు పన్ను చెల్లింపుదారులకు మరింత పారదర్శకతను, ప్రయోజనాలను అందించేందుకు దోహదపడనున్నాయి.
ఇంటినిచ్చే అద్దెపై కూడా పన్ను మినహాయింపు
అత్యంత కీలకంగా, ఇంటిపై ఆదాయం పొందుతున్న పౌరులకు ఉపశమనం కలిగించే మార్పులను ఈ బిల్లులో చేర్చినట్టు సమాచారం. ఇప్పటివరకు హోం లోన్‌పై వడ్డీకి పన్ను మినహాయింపు సొంతంగా నివసించే ఇంటికే వర్తించగా, కొత్త ప్రతిపాదనల ప్రకారం అద్దెకు ఇచ్చిన సొంత ఇంటిపైనా ఈ మినహాయింపు వర్తించేలా మార్పులు చేయబోతున్నారు.
టీడీఎస్, టీసీఎస్ రిఫండ్ల ప్రక్రియలో సరళతర మార్గం
పన్నుదారులకు కలిగే మరో సౌలభ్యం టీడీఎస్ (Tax Deducted at Source) మరియు టీసీఎస్ రిఫండ్ల ప్రక్రియను సరళీకృతం చేయడం. పన్ను తిరిగి పొందడంలో వేళ్లుబాటు తగ్గించేందుకు, వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్పులు ఈ బిల్లులో ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లు శాసనసభా సమీక్ష అనంతరం అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. పన్ను చట్టాన్ని ఆధునీకరించే దిశగా ఇది ఒక కీలకమైన అడుగుగా ప్రభుత్వం చెబుతోంది.
Also Read : Stock Market Crash Sensational : దేశీయ స్టాక్ మార్కెట్ లో ట్రంప్ సుంకాల మోత


















